మహబూబాబాద్ లో కుక్కల స్వైర విహారం

మహబూబాబాద్ మున్సిపాలిటీ కేంద్రం స్థానిక కొండపల్లి గోపాలరావు నగర్ కాలనీలో కుక్కల స్వైర విహారం, బీభత్సవం వరుస పెట్టి కాలనీ ప్రజలను కరుస్తున్న పట్టింపు లేని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి, పెరుగు కుమార్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న డిమాండ్
ఆదివారం సుమారు సాయంత్రం 5:00 గంటల నుండి కొండపల్లి గోపాలరావు నగర్ కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ, బీభత్సం సృష్టిస్తూ కాలనీ ప్రజలను వరుస పెట్టి
కరుసుకుంటూ వెళ్లడం జరిగిందని, తక్షణమే మానుకోట మున్సిపాలిటీ పరిధిలో కుక్కలను నివారించి తక్షణ చర్యలు తీసుకొని, ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న లు డిమాండ్ చేశారు. కుక్కలు కరిచిన బాధితులు జాడి భవిష్ కాగితం వినయ్ వెంగలి శ్రీనివాస్ ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *