మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల మున్సిపాలిటీ ఎన్నికల బరిలో దిగనున్న జనసేన పార్టీ

కో ఆర్డినేటర్ దాసరి రావిష్

మహబూబాబాద్ :

జనసేన పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గం లలో రాబోయే మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని కో ఆర్డినేటర్ దాసరి రావిష్ గారు పార్టీ ముఖ్య నేతల సమక్షంలో మీడియాకు తెలియజేశారు. అలాగే సంస్థాగతంగా జనసేన పార్టీ బలోపేతం దిశగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావా జాలాన్ని,ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా మహిళలు,యువత పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కొత్తగా వచ్చే వారిని ఆహ్వానించి త్వరలో చేరికల కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గం లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా బరిలో నిలిచే ఆశావాహులు,నియోజకవర్గం లలో ఉన్నటువంటి జనసైనికులు అందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ జనసేన పార్టీ తరఫున చేస్తున్నటువంటి సామాజిక,ప్రజాసేవ-పోరాట కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని రానున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా బరిలో నిలుస్తున్న తమ జనసేన పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెరుగు చక్రపాణి గౌడ్, చింత రమేష్, ఆసిఫ్, ఉదయ్ కుమార్, వేర్పుల అనిల్ కుమార్, తగరం వివేక్, కొండ్రా శ్రీకాంత్, మేకల గోపాల్, సురేష్, నీరజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *