ర్యాంకు సాధించిన గిరిజన విద్యార్థినికి ఆర్థిక సాయం

మహాతెలంగాణ/మహబూబాబాద్:

మహబూబాద్ జిల్లా కేంద్రంలోని భవాని నగర్ తండాకు చెందిన బానోతు శ్రావణి ఇంటర్లో 982 అత్యధిక మార్కులు సాధించినందుకు ఆమెకు తండాకు చెందిన రైల్వే ఉద్యోగి, సామాజిక సేవకులు పాండు రూ.10,116 ఆర్థిక సాయం అందించారు. ఈ సాయాన్ని మహబూబాబాద్ జిల్లా బేస్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి ప్రభాకర్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణి అత్యుత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ భూక్యా లక్ష్మీ, విద్యార్థిని తల్లి బానోత్ రుక్మిణి, బానోత్ భద్రు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *