సీనియర్ సిటిజన్ ఓటర్లకు సన్మానం
మహబూబాబాద్ :
16వ జాతీయ ఓటరు దినోత్సవం-2026, వేడుకలు ఈరోజు అనగా జనవరి 25 ఆదివారం కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, సంబంధిత అధికారులు, సీనియర్,యువ, ఓటర్లు, ఎన్నికల విభాగం సిబ్బంది, అందరితో కలిసి ఓటరు దినోత్సవ వేడుకలు నిర్వహించారు, ఈ సందర్భంగా నా భారతదేశం, నా ఓటు, భారత ప్రజాస్వామ్య హృదయంలో పౌరుడు.. అనేక నినాదంతో కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు, అంతకుముందు ఓటు హక్కు వినియోగం నమోదు తదితర ప్రభుత్వం సూచించిన అంశాలపై, స్వయం సహాయక బృందాలు మహిళా సభ్యులు రంగోలి కార్యక్రమం నిర్వహించారు, సాంస్కృతిక కార్యక్రమాలు చిన్న పిల్లల స్కిట్స్, తెలంగాణ సాంస్కృతిక సారధి బృంద సభ్యులచే ఓటరు చైతన్యం నమోదు పాటల కార్యక్రమం, సీనియర్ సిటిజన్ ఓటర్లకు సన్మానం, యువ ఓటర్లుగా నమోదు అయిన వారికి ఎపిక్ కార్డ్స్ పంపిణీ, భారత ఎన్నికల సంఘం రూపొందించిన ప్రతి ఒక్క వీడియో తిలకించి, ఓటరు జాబితా ఎన్నికల విభాగం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన, బూత్ లెవెల్ అధికారుల సన్మానం తదితర కార్యక్రమాలతో ఘనంగా వేడుకలను నిర్వహించారు,
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు,కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి,
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మధుసూదన రాజు, రాజేశ్వర్, సబిత, మరియాన్న, రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, తహసిల్దార్లు, ఎన్నికల విభాగం డిప్యూటీ తాసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్, ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో జాతీయ ఓటరు దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.