సమ్మర్ క్యాంపులు పిల్లల సృజనత్మకత మానసిక, ఆరోగ్య, విద్యా మేధస్సు వెలికి తీయడానికి ఉపయోగపడాలి

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

సమ్మర్ క్యాంపులు పిల్లల మానసిక, ఆరోగ్య, విద్యా మేధస్సు వెలికి తీయడానికి ఉపయోగపడాలన్నారు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సోమవారం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) లో జరుగుతున్న సమ్మర్ క్యాంపును పరిశీలించి పిల్లలకు స్వయంగా మాట్లాడారు,

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాంట్ కార్యక్రమంలో భాగంగా
సమగ్ర శిక్ష తెలంగాణ ప్రత్యేక విద్య వారోత్సవాల సందర్భంగా మే 11 నుండి మే 17 వరకు వరకు నిర్వహించే విద్య వారోత్సవాలను షెడ్యూల్ వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు,

సాధారణ సమ్మర్ క్యాంపులు మే 11 నుండి మే 25 వరకు, (18) క్యాంపులు, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థినీ విద్యార్థుల కోసం రీమిడీయల్ పీఎం శ్రీ పాఠశాలలో ప్రత్యేకంగా (రెండు సమ్మర్ క్యాంపులు), తొర్రూరు, మహబూబాబాద్ లలో కేజీబీవీ మరిపెడ లో (1) మొత్తం జిల్లాలో (21) సమ్మర్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు,

ఈ క్యాంపులలో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్య, క్రీడా, సాంస్కృతిక, తదితర ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ అధికారి పర్యవేక్షణ లో సబ్జెక్టుల వారీగా నిపుణుల బోధనలతో పాటు డ్రాయింగ్, పెయింటింగ్, క్యారమ్స్, చెస్, మొదలగైన ఆటలు అందుబాటులో ఉంటాయని, అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు,
పాఠశాలలలో గ్రంధాలయాలు ఏర్పాటు చేసి తగినన్ని బుక్కులు అందుబాటులో ఉంచాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థినీ, విద్యార్థులకు,పాఠకులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు,

ప్రత్యేక విద్యా వారోత్సవాలు జరిగే మే 11 నుండి మే 17 వరకు (7) ఏడు రోజులు పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు పునాది దినోత్సవం, పదవ తరగతి, రీమిడీయల్ క్యాంపు ల ప్రారంభం, సర్పంచులతో పాఠశాల విద్య కార్యక్రమాలపై వర్క్ షాప్, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం, గ్రంథాలయ దినోత్సవం, సాంస్కృతిక హస్తకళల దినోత్సవం, చివరి రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుని పకడ్బందీగా కార్యక్రమాల నిర్వహణ చేస్తూ సిద్ధంగా ఉన్నామని అన్నారు,

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించడం కోసం విస్తృత ప్రచారం కల్పించడం జరిగిందన్నారు,

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, విద్యాశాఖ అధికారులు శ్రీరాములు, అప్పారావు, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.


WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *