మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి
మహాతెలంగాణ/మహబూబాబాద్:
పుస్తక పఠనంతో విజ్ఞానం… తద్వారా సమాజ వికాసం వర్ధిల్లుతుందని మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అయినా ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుంచి 17 వరకు ,ఈరోజు ఐదవ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పుస్తకం చదవండి జ్ఞానం పెంపొందించుకోండి సమాజాన్ని వికాసవంతంగా వెలిగించండి అని అన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని సంపాదించాలని మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా పుస్తకాలతో స్నేహం చేయాలని మహబూబాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో , గ్రంథాలయ పాఠకులకు కావలసిన వసతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని పాఠకులు తమ సమస్యలను నేరుగా తనకు తెలియజేయాలని సూచించారు, సమాజ అభివృద్ధి కి విద్య ఎంతో ముఖ్యమని ప్రతి విద్యార్థి ఉన్నంత లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి టి శ్రీలత, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, సీనియర్ పాఠకుడు టీవీ రామనర్సయ్య, డిఎస్ఓ అప్పారావు , ఏ సి జి, మందుల శ్రీరాములు, ఏ ఎస్ సి సంతోష్, ముక్క లక్ష్మణరావు, నరసింగ శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ గ్రంథపాలకులు, జి విజేందర్, సిహెచ్ రవి, రుద్రారపు వీరేందర్ ,భూలక్ష్మి, యాదమ్మ బాబా , పుస్తక ప్రియులు , పాఠకులు , విద్యార్థిని విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.