కన్నన్న వర్ధంతి సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి
మహాతెలంగాణ/మహబూబాబాద్
భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత అమరజీవి సిపిఐ మాజీ మండల కార్యదర్శి ప్రజానేత కామ్రేడ్ బి పార్థసారధి రెడ్డి, కన్నన్న వర్ధంతి సభ నేడు 19వ వార్డులోని కన్నన్న కాలనీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వర్ధంతి సభకు కన్నన్న కాలనీ శాఖ కార్యదర్శి కేదాసు రమేష్ అధ్యక్షత వహించారు. ఈ వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ కన్నన్న సేవలు మరువలేనివి అన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక ఉద్యమాల్లో చెరగని ముద్ర వేశాడన్నారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే సర్పంచ్ గెలవడంలో కన్నన్నదే కీలకపాత్ర అన్నారు. దురాలకు వ్యతిరేకంగా పేద ప్రజలకు అండగా పోరాటాలు చేశాడన్నారు క్రీడాకారుడిగా క్రీడలను ప్రోత్సహించాడు అన్నారు. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు లెక్క ఆపద వచ్చిన వారికి స్నేహితుడు లెక్క వారి సమస్యను పరిష్కరించే వాడన్నారు ఎన్నో భూ పోరాటాల్లో పాల్గొని ఈ ప్రాంతంలో వేలాది మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి ఇంటి స్థలాలు పంచేలా కృషి చేశాడు అన్నారు. పార్టీ కష్ట కాలంలో పార్టీకి వెన్నుముక లెక్క నిలబడి పార్టీని ముందుకు నడిపించాడన్నారు. శత్రువులు పన్నిన కుట్రలను తిప్పి కొట్టి పార్టీలు నిలబెట్టిన గొప్ప చరిత్ర కన్నన్నది అన్నారు నిస్వార్థ సేవకుడిగా ఈ ప్రాంతంలో తనదైన శైలిలో ముద్రవేశాడన్నారు. యువజన సంఘం నేతగా రైతు సంఘం నేతగా ఆయా సంఘాల్లో తనదైన శైలిలో ఉద్యమాలు సాగించాడు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో ప్రత్యేక పాత్ర పోషించాడని ఆయన మన మధ్యన లేకపోవడం బాధాకరమని ఆయన ఆశయాలు కొనసాగిస్తామని బి విజయ సారధి తెలిపారు. ఈ వర్ధంతి సభలో సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి, కన్నన్న కుమారుడు సాద్విత్ రెడ్డి, పెరుగు కుమార్, వార్డు కౌన్సిలర్లు రేషపల్లి నవీన్ నర్రా సంధ్య శ్రావణ్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, తండ సందీప్ వెలుగు శ్రావణ్, భానోత్ లింగ్య నాయక్, వంకాయలపాటి చిరంజీవి, మంద శంకర్, బీదర్, జానీ నాగేల్లి యాకమ్మ, ఎర్రోజు పద్మ, సరిత, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు అమరజీవి కన్నన్న పై పాట రచించి సిడిని ఆవిష్కరించారు.