గార్ల పోలీస్- ప్రెస్ మధ్య ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్

మహా తెలంగాణ/ గార్ల

అనునిథ్యం ప్రజల్లో ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే పోలీస్‌, ప్రెస్‌కి మధ్య ఎల్లప్పుడూ సత్సంబంధాలు ఉండేందుకు ఫ్రెండ్లీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించినట్లు గార్ల బయ్యారం సిఐ రవీందర్ అన్నారు. మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామి క్రీడా మైదానంలో ఆదివారం పోలీస్‌, ప్రెస్‌ ఫ్రెండ్లీ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉత్సహాబరిత వాతావరణం లో జరిగింది. రెండు మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న పోలీస్ టీం 10 ఓవర్లలో 107 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ తీసుకున్న ప్రెస్ టీం 10 ఓవర్ల లో 87 పరుగులు చేసి అల్ ఔట్ అయ్యారు. 20 పరుగుల అధిక్యంతో ప్రెస్‌ జట్టుపై పోలీస్ జట్టు విజయం సాధించారు. క్రికెట్‌ టోర్నీలో సిఐ రవీందర్ స్వయంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ వేసి క్రీడాకారులను ఉత్సాహపరిచడమే కాకుండా వరుసగా ఐదు వికెట్లు పడకొట్టి జట్టు విజయానికి కారకులయ్యారు. గార్ల ఎస్సై సాయి కుమార్ వరుస సిక్సర్లతో 52 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ప్రత్యేక అతిగా పాల్గొన్న డోర్నకల్ సిఐ చంద్రమౌళి చక్కటి క్రీడా నై పుణ్యాన్ని ప్రదర్శించిన, ఇరు జట్లను అభినందించారు. ప్రెస్ పోలీస్ ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ సందర్బంగా పూర్తి ఏర్పాట్లు చేసిన మర్రిగూడెం సర్పంచ్ రాంసింగ్ నాయక్ కు పోలీస్ ,ప్రెస్ తరుపున ధన్యవాదాలు తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *