మహా తెలంగాణ/మరిపెడ :
తెలంగాణ ప్రభుత్వం ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.ఇటీవల మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరిపెడ మండలం తలవుకల్ గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గురువారం ఏపీడి శ్రీనివాసరావు కొనుగోలు కేంద్రంలో పర్యటించి గ్రామస్తులు రైతుల సమక్షంలో విచారణ జరిపారు వచ్చిన ఆరోపణలను అన్నింటిని విచారణ జరిపి నివేదిక ఉన్నత అధికారులకు సమర్పిస్తామని, పై అధికారుల సూచనల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ సర్పంచ్ తప్పెట్ల శ్రీనివాస్,ఏపిఓ అలివేలు మంగమ్మ,సీసీ,సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.