ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ పాఠశాలలను ప్రజాప్రతినిధులు సందర్శించాలి
పీడీ,ఎస్,యు జిల్లా అధ్యక్షుడు ఎం.మహేష్

మహా తెలంగాణ/గార్ల :

ప్రభుత్వ పాఠశాలలను ప్రజాప్రతినిధులు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని పిడి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు ఎం.మహేష్ అన్నారు. శనివారంనాడు గార్ల మండల పరిదిలోని ముల్కనూరు జెడ్ హెచ్ ఎస్ పాఠశాల గేట్ వద్ద పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ 23 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని అన్నారు. ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి అని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్ ఫాస్ట్, మిల్క్ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని,ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని,విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించాలి.నూతన తరగతి గదులను ఏర్పాటు చేయాలని,సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వాలని అన్నారు.ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి, పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు . మండలానికి ఒక రెగ్యులర్ ఎంఈఓని నియమించాలని, స్కూల్ కి ఒక రెగ్యులర్ స్కావెంజర్ ని నియమించాలని అన్నారు. లేనియెడల ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎం మనోజ్, నరేష్, శృతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *