మహా తెలంగాణ /గార్ల :
తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలను ఆదుకోవాలని వారికి 250 గజాల స్థలము 25 వేల రూపాయల పెన్షన్ ఆరోగ్య బీమా కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర నాయకులు మైసా శ్రీనివాస్ డోలి సత్యనారాయణ అన్నారు. శనివారంనాడు గార్ల మండల కేంద్రంలో ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ 2009 నుండి 2014 వరకు తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వీరుల త్యాగాలని మరువబోమని సర్వస్వం త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, తెలంగాణ సాధన కోసం బహుముఖంగా అనేక పోరాట రూపాలను విజయవంతం చేయడంలో జిల్లాలోనే గార్ల మండలం ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. బస్సు రోకో, చోడో వంట వార్పు రైల్ రోకో సమస్త కులాల ఆందోళనలు, సకల జనుల సమ్మె, బంధులు, తదితర పోరాటాలను గార్ల ఉద్యమకారులు నడిపించారని, పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి మానసిక హింసలకు గురయ్యారని, జైలు పాలు కూడా అయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం పోరాటం చేసినటువంటి వారిని మరవద్దని వారికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ హామీలను అమలు చేయాలని అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం మహబూబాబాద్ లో జరిగే కోదండరాం అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ,ల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొని పై డిమాండ్లను వినతి పత్రాల ద్వారా ఎమ్మెల్సీలకు ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిల్లి సుధాకర్, జెఏసీ నాయకులు జడ సత్యనారాయణ, మాగం లోకేష్, సాగర్, పిల్లలమర్రి వీరస్వామి, ఇర్రి రవి, తొ డేటి శ్రీనివాస్, సామ్య, కోల కుమార్ గౌడ్, ధారావత్ రవి, భీముడు, తదితరులు పాల్గొన్నారు