గ్రామాభివృద్దే లక్ష్యం గా సర్పంచులు- గ్రామ కార్యదర్శిలు పని చేయాలి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

మహాతెలంగాణ/ మహబూబాబాద్ :

గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం బుధవారం ఆర్.సి కన్వెన్షన్ హాలులో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. మంత్రితో పాటు ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఉన్నతాధికారులుగా పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, తదితరులు పాల్గొన్నారు. భాగస్వామ్యమయ్యారు. జిల్లాలోని (482) సర్పంచులు,(405) పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల సమగ్ర అభివృద్ధి, పంచాయతీరాజ్ చట్టం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీసుకోవలసిన చర్యలు పై దివ్య దేవరాజన్, కలెక్టర్ స్నేహ శబరిష్, తదితరులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఐదు శాఖల ద్వారా కమిటీని వేసుకొని ముందుకు సాగుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు నిధులు తదితర అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా జులై 8,9,10 మూడు రోజులు మండల స్థాయి, డివిజనల్ స్థాయిలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పంచాయతీరాజ్ కమిషనర్ తాను స్వయంగా క్షేత్రస్థాయిలో తిరుగుతూ మహిళ సంఘాల ఆర్థిక అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సర్పంచుల ఐదు సంవత్సరాల కాలం పదవిలో ఉంటారని కచ్చితంగా శిక్షణ అవసరమన్నారు. గ్రామాల పటిష్ట అభివృద్ధికి కృషి చేస్తున్నామని గ్రామాల బాగుపడితే జిల్లా, రాష్ట్ర, దేశాలు బాగుపడుతుందని, తద్వారా ప్రతి ఒక్కరూ బాగుంటారని తెలిపారు. కొత్తగా విబిజి రామ్ చట్టం రావడం ద్వారా రాష్ట్రంపై భారం పడుతుందని, కొత్త చట్టం పరిధిలో ఏ ఏ పనులు వస్తాయో తెలుసుకొని అవగాహన సర్పంచులకు ఉండాలన్నారు. మొన్న 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీలలో జమ అయినాయని, వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ఒక ప్రణాళిక ప్రకారం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, విద్యుత్, స్కూల్ పనులు, ఉపాధి హామీ పనులు పనులు, అంతర్గత అభివృద్ధి పనులు తదితర అంశాలపై డాష్ బోర్డు పై నమోదు చేసుకొని ఉండాలని ప్రతిరోజు వారి పనులు కేటాయింపులు పూర్తి, పెండింగ్, వివరాలను వెంట వెంటనే తమకు నివేదికలు పంపాలని సూచించారు. కొత్త చట్టం ప్రకారం పని దినాలను తగ్గించడం జరిగిందని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రం వాటా జమ చేయడం జరిగిందని, ఈ పథకం ద్వారా తీసుకున్న పనులను వేగవంతం చేయాలని బిల్లులో పెండింగ్ ఉన్నందున వేగంగా చేయాలన్నారు. వివో భవనాలు, అంగన్వాడి భవనాలు, గ్రామాలలోని నీటి కుంట, ఊట కుంట, ఇంటి కుంట, ప్రత్యేక వసతులు పనులను నిర్మించుకోవాలని సూచించారు, గ్రామస్థాయిలో వసూలు చేసిన నిధులను స్టేట్ నిధులను స్వయంగా వారే వినియోగించుకునే విధంగా కొత్తగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, గతంలో సర్పంచులు లేక అనేక ఇబ్బందులు ఉండేవని ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు ఏర్పడి నందున, వేగంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు, ప్రతి ఒక్కరూ మనసుపెట్టి విధులు నిర్వహించాలని సూచించారు. పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, అదే కోవాకు చెందిన వారిని, పని చేసిన ప్రదేశాలలో ఇప్పటికీ గుర్తుంచుకుంటారని దివ్య గారి పేరు మీద ఏకంగా ఒక గ్రామమే ఏర్పడిందని గుర్తుకు చేశారు, విప్ప పువ్వు లడ్డు, వారి ఆర్థిక అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పపువ్వు లడ్డు ప్రస్తావన దేశ ప్రధాని గారి ద్వారా వచ్చిందని అందుకు కృషి చేసిన వ్యక్తి దివ్య గారు అని అన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా గ్రామాల సమగ్ర అభివృద్ధి పాటుపడాలని తెలిపారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను పూర్తి చేయాలని సూచించారు, పంట పొలాలకు వెళ్లే దారిలలో రహదారి నిర్మాణం కోసం గ్రామ సభల ద్వారా ప్రతిపాదన చేసుకుని పనులను పూర్తి చేయాలని అన్నారు, ఏదైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో తనను కానీ అధికారులను కానీ నేరుగా సంప్రదించాలని కోరారు. ఆదర్శ గ్రామాల అభివృద్ధి ఎంపికలో గ్రామస్థాయిలో 10 అంశాలలో అభివృద్ధిని చూస్తారని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపికైన గ్రామాలకు అధిక నిధులు వస్తాయని తెలిపారు, గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించి సస్పెండులకు గురికా వద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా ఉన్నత పదవులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారని గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తున్నాయని అట్టి నిధులను వినియోగించుకొని ముందుకు సాగాలని మంత్రి అన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కలెక్టర్ స్నేహ శబరిష్ లు గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్లుప్తంగా తమ సలహాలను సూచనలను తీసుకోవలసిన చర్యలు సర్పంచులను, గ్రామ కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం శిక్షణ తరగతులలో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో గత మూడు నెలల్లోనే ఏడు కోట్ల పని దినాలను కల్పించడం జరిగిందని, ఇక్కడ అధిక నిధులు, క్షేత్రస్థాయిలో సరిపడా ఉద్యోగులు ఉన్నారని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అనేక కార్యక్రమాలు ఉన్నాయని అట్టి కార్యక్రమాలను వినియోగించుకుని ఆర్థికంగా స్థిరపడేందుకు సర్పంచులు కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉపాధి హామీ కింద పని దినాలు కోరుకోవడం జరుగుతుందని వారికి పని చేసే అవకాశం కల్పించాలని, మహబూబాబాద్ జిల్లా నుండి మంజుల అనే మహిళ స్వయంగా కోరిన వివరాలను చూపించారు. మంత్రిగారు ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలం కు పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట, కచ్చితంగా నిర్మించుకోవాలని కోరారు ఇట్టి పనుల ద్వారా ఉపాధి హామీలు లక్ష్యం మేరకు పని దినాలు చేరుకోవడం జరుగుతుందని అన్నారు, ప్రస్తుతం ఉన్న గ్రామ కార్యదర్శి లు ఉన్నత విద్యావంతులు అని వారు ఒకసారి మనసుపెట్టి పనిచేస్తే ప్రతి గ్రామంలో లక్ష్యానికి అనుగుణంగా పని దినాలను కల్పించడం జరుగుతుందని ,గ్రామస్థాయిలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని సూచించారు, మహబూబాబాద్ జిల్లాలో ఎవరైనా ఓపెన్ వెల్స్, బోరుబావిలు కావాలని కోరితే, స్థానిక పరిస్థితులను బట్టి అట్టి బోరు బావులు ఓపెన్ వెల్స్ మంజూరు చేయొచ్చు అని, బోర్ వెల్స్ రీఛార్జ్ విధానం ద్వారా పనులు ప్రారంభించాలన్నారు, తెలంగాణ జలసిరి కార్యక్రమానికి అందరూ సిద్ధంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో కోరిన ప్రతి ఒక్కరికి అధిక పని దినాలు కల్పించాలని అందువలన కేంద్రం నుండి నిధులు సమీకరించే బాధ్యత మేము తీసుకుంటామని సర్పంచులకు, గ్రామ కార్యదర్శిలకు పిలుపునిచ్చారు,

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఇప్పటివరకు ఇలాంటి శిక్షణ తరగతులు నిర్వహించబడలేదు అన్నారు, ప్రస్తుతం ఈ శిక్షణ ద్వారా సర్పంచుల పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటాయని ఈ కాలంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని తెలిపారు, హెల్త్, ఎడ్యుకేషన్, సానిటేషన్, న్యూట్రిషన్, వీధి దీపాలు, సీసీ రోడ్స్, మహిళ, చిన్నపిల్లలు, పర్యావరణ పరిరక్షణ, ప్రణాళికా ప్రకారం చర్యలు తీసుకుని విజయం సాధించాలని అన్నారు, ఊరు సమస్యలు గుర్తించాలని, ఊరుకు సంబంధించిన వనరులను గుర్తించాలని, ఉపాధి హామీ కొత్త చట్టం మార్పులు, సౌకర్యాలు విషయం తెలుసుకోవాలని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులను ఎలా వినియోగించుకోవాలో గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా ఎలాంటి నిధులు ఖర్చు చేయకూడదని, దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ లో అభివృద్ధిలో ఉందన్నారు, అందుకోసం ముందు చూపుతో గ్రామపంచాయతీ లో కావాల్సిన సౌకర్యాలు ట్రాక్టర్స్, ట్రాలీ, నర్సరీ, క్రీడా ప్రాంగణం, జనాభా ప్రాతిపదికన సౌకర్యాలు, కల్పించడం జరిగిందని, అందుకు అందు గాను జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు తీసుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు, కొత్తగా ఎన్నికైన మీరందరూ ఇదే స్పూర్తితో పని చేయాలని, ఇటీవలే హౌసేస్ లిస్టింగ్ సెన్సెస్ పూర్తి చేసుకున్నామని, కులగనన, ఈ రెండు సర్వేలలో గుర్తించిన విషయం ఏమిటి అంటే మరుగుదొడ్లు లేవని, అట్టి సమస్యను పరిష్కారం చేయడం కోసం గ్రామాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని, గుర్తించాలని, అందుకు అనుగుణంగా నిధులను సమీకరించుకోవాలని, సొంత నిధులు, ఉపాధిహామీ నిధులు, కొత్త చట్టం నిధులు, అన్ని విషయాలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలే కాకుండా, ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం సొంత ఆదాయ వనరులు, ఇతరులకు పని కల్పించడం కోసం, సోలార్ ప్లాంట్స్, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ పంపులు, కల్పించడం జరిగిందని ఇదేవిధంగా గ్రామపంచాయతీలు కూడా సొంత ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి సర్పంచ్ అనే వారు చాలా ముఖ్యమైన వ్యక్తి అని గుర్తుకు చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలను అమలుపరచాలన్న ముందుగా సంప్రదించాల్సిన వ్యక్తి సర్పంచ్ అనే అన్నారు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని తెలంగాణ రైజింగ్ ద్వారా గొప్ప లక్ష్యాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారని, గ్రామ జిల్లా రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పీడీ పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జిల్లా పంచాయతీ అధికారి హరి ప్రసాద్, అన్ని విభాగాల అధికారులు. తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *