మహా తెలంగాణ/బయ్యారం :
బయ్యారం మండల శాఖ ఆధ్వర్యంలో పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మిర్యాల సతీష్ రెడ్డి గారు పాల్గొని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పి ఆర్ సి ని తక్షణం అమలు చేయాలని హెల్త్ కార్డును వెంటనే అమల్లోకి తీసుకొని రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు మోహన్ నాయక్ గారు మాట్లాడుతూ కేజీబీవీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు ప్రధాన కార్యదర్శి నీలం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో సమస్యలను పండిట్ పీఈటీలకు అప్రిడేషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం ఈరోజు మండలంలో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోహన్ నాయక్ గారు ప్రధాన కార్యదర్శి నీలం శ్రీనివాస్ గారు రాష్ట్ర బాధ్యులు ఎం నరసింహ రావు గారు జిల్లా బాధ్యులు సుధాకర్ గారు రామారావు గారు మరియు వెంకట్రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు.