మహా తెలంగాణ/మరిపెడ
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామంలో ఆర్యవైశ్య పెద్దలు తీపిర్శెట్టి శ్రీనివాస్ రమ దంపతులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పెన్నులు గ్రామ సర్పంచ్ తప్పెట్ల శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా తమ వంతు సహాయాన్ని పేద విద్యార్థులకు అందించడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తప్పెట్ల శ్రీనివాస్,ఉపసర్పంచ్ బోర మల్లయ్య,తీపిరి శెట్టి గోవర్ధన్,జిల్లా వైశ్య సంఘము అధ్యక్షులు వెంకట రామారావు,గ్రామ నాయకులు తిరుపతయ్య,వార్డ్ సభ్యులు చిరంజీవి,భూక్యా శ్రీను,వెంకటమల్లు,సుధాకర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.