మహా తెలంగాణ/ కేసముద్రం;
కాంగ్రెస్ పార్టీ కేసముద్రం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా చిలువేరు సమ్మయ్య గౌడ్ నియమితులైన సందర్భంగా తాళ్ల పూసపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సమ్మయ్య గౌడ్ అభిమానులు పెద్ద సంఖ్యలో కేసముద్రంలోని ఆయన నివాసానికి చేరుకుని ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సమ్మయ్య గౌడ్ నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. అనంతరం సమ్మయ్య గౌడ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ,నరేటి కొమురయ్య, గ్రామ కార్యదర్శి శీలం యకన్న,మాజీ సర్పంచ్ కందుకూరి దాసు ,వార్డ్ మెంబెర్స్, పెటేరు వెంకన్న,బండి అశోక్,విలసాగరం అనిల్, యూత్ అధ్యక్షులు గొండ్యాల శ్రీను,సీనియర్ నాయకులు రాచర్ల రాములు, బోయిని ఉప్పలయ్య,కాలేరు రామ్మూర్తి ,చేవుగోని ఉప్పల్లయ్య, వల్లాల రవి, గొడిశాల సైదులు, గౌoడ్ల కళ్యాణ్, నరేటి విజయ్, వల్లాల రాజేందర్, శ్రావణ్,తదితరులు పాల్గొన్నారు