మహాతెలంగాణ/మరిపెడ:
భారతరత్న మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరిపెడ మండల అధ్యక్షులు గుగులోతు రవి నాయక్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుగులోతు రవి నాయక్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మరిపెడ ప్రభుత్వ అతిథి గృహం నుండి మహబూబాబాద్ క్రాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి,పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకొని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,యువతకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనని గుర్తు చేశారు.ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అర్హులైన ప్రతి యువకుడు ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో పేరు లేని 18 సంవత్సరాలు నిండిన యువత కోసం ఫారం-6 నమోదు కార్యక్రమాన్ని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగేందర్ రెడ్డి,టౌన్ అధ్యక్షులు బానోతు రామ్లాల్ నాయక్,మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దబోయిన ఐలమల్లు,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జర్పుల విజయ్,డోర్నకల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సందీప్,డోర్నకల్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గాదెగాని నరేష్,మండల యూత్ అధ్యక్షులు బానోతు నరేష్,నాయకులు పెళ్లి శ్రీనివాస్ రెడ్డి,అప్సర్,నరసింహారెడ్డి,రఘునందన్ రెడ్డి,రవికాంత్,గ్రామ పార్టీ అధ్యక్షులు,సర్పంచులు,కౌన్సిలర్లు, మహిళా నాయకులు,కాంగ్రెస్ యువజన నాయకులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు,కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.