*పి ఆర్ టి యు టి ఎస్ మహబూబాబాద్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

మహా తెలంగాణ/ మహబూబాబాద్

పి ఆర్ టి యు టి ఎస్ మహబూబాద్ మండల నూతన కార్యవర్గ ఎన్నికలలో మండల అధ్యక్షురాలుగా కాపరబోయిన సుజాత, మండల ప్రధాన కార్యదర్శిగా కొప్పుల నాగరాజు ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా రాపోలు యాకయ్య గారు, ఎన్నికల అధికారులుగా జి శ్రీధర్, వి.సీతారాములు, జనార్దన్ రెడ్డి, ప్రభుదాస్ యుగంధర్ రెడ్డి, భాస్కర్లు ఎన్నికలు నిర్వహించారు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో సుజాత, నాగరాజు గార్లతో పాటు వారి నూతన కార్యవర్గం ఎన్నికైంది. మండల అసోసియేట్ అధ్యక్షులుగా సత్యనారాయణరెడ్డి, మధు మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా బి కౌసల్య, సుశీల ఉపాధ్యక్షులుగా కే. వెంకటేశ్వర్లు,చంద్రశేఖర్ మహిళా ఉపాధ్యక్షులుగా రజనీ,విజయ కార్యదర్శులుగా కృష్ణయ్య, విజయ్ కుమార్, పర్వతాలు మహిళా కార్యదర్శులుగా మౌనిక, ఝాన్సీ రాణి, నవీనలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిర్యాల సతీష్ రెడ్డి చాగర్లమూడి శ్రీధర్ గార్లు, AIFTO జాతీయ ఉపాధ్యక్షులు నూకల గీతారెడ్డి గారు, రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు గుగులోతు హాల్యా నాయక్, వెంకట్ రెడ్డి కనకయ్య లక్ష్మారెడ్డి, శ్రీధర్ వెంకన్న వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *