చెంగిచెర్ల.. మహాసభలను విజయవంతం చేయాలి

మహాతెలంగాణ/నర్సింహులపేట:

గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని నర్సింహులపేట మండల సంఘం అధ్యక్షుడు భారీ రమేష్ యాదవ్ కోరారు. చెంగిచెర్లలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించే మహాసభలకు గొర్రెలు, మేకల పెంపకందారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. గొర్రెల కాపరుల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు రూ.30 లక్షలతో గొర్రెల ఫామ్‌ల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే గొర్రెలు, మేకలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రేఖ ఐలయ్య, రేఖ మల్లయ్య, కోడి సోమయ్య, కోడి వెంకన్న, కొంపెల్లి నరేష్, పున్నేపుర్తి ఐలయ్య,మర్రి జంపయ్య, రేఖ కిషోర్,రేఖ గంగయ్య,కొంపెల్లి వెంకన్న, కొంపెల్లి మల్లయ్య, కొమ్ము లింగయ్య తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *