జనసేన ఆత్మీయ సమ్మేళనం విజయవంతానికి పిలుపు: చింత రమేష్

మహా తెలంగాణ/మరిపెడ:

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 22న హన్మకొండలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు డోర్నకల్ నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసి మెంబర్ చింత రమేష్ తెలిపారు.శుక్రవారం మరిపెడలో ఆయన మాట్లాడుతూ,పార్టీ అంతర్గత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం,కార్యకర్తలతో సమన్వయం పెంపొందించడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగానే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం హన్మకొండలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.శనివారం ఉదయం 10 గంటలకు ఫాతిమా జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం,అదాలత్,కాళోజీ జంక్షన్,అంబేద్కర్ సెంటర్ మీదుగా హన్మకొండ బస్టాండ్ సమీపంలోని శ్రీ హర్ష కన్వెన్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ
నిర్వహించనున్నట్లు తెలిపారు.ర్యాలీలో డీజే,డప్పు కళాకారులు,కోలాటాలు, బతుకమ్మలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఆత్మీయ సమ్మేళనం అనంతరం పాల్గొనే నాయకులు,వీరమహిళలు, కార్యకర్తలకు విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జనసేన నాయకులు,వీరమహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చింత రమేష్ పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *