మహాతెలంగాణ/మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల వ్యవసాయ శాఖ ఆత్మ కమిటీ ల ఆధ్వర్యంలో ఏడిఏ కార్యాలయం నందు శనివారం ఆత్మ కమిటీ సభ్యులకు వివిధ మండలాల వ్యవసాయ అధికారులకు ఆత్మ బడ్జెట్ పైన ప్రణాళిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు పి.మురళి మాట్లాడుతూ,వచ్చే వారం రోజులలో అన్లాల్ వారీగా విభజించి ట్రైనింగ్,స్కూల్ ఫామ్స్,డిమాండ్ స్టేషనులు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్లు,వివిధ మండలాల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.