మహాతెలంగాణ/మరిపెడ:
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని మరిపెడ సీఐ ఎల్ పవన్ కుమార్ అన్నారు.జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాలతో శనివారం మండల పరిధిలోని సోమలా తండా జిపిలో సీఐ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.అనుమానితులు ఇల్లులు,గుడుంబా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగగా,ఈస్ట్, చక్కెరలతో నాటుసారా కాస్తున్న 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోనీ,సుమారు 1500 లీటర్ల షుగర్,ఈస్ట్ కలిపినా పానకం ధ్వంసం చేసి,20 లీటర్ల నాటుసారా,నాటు సారా తరలించడానికి ఉపయోగిస్తున్న రెండు బైకులు సీజ్ చేశారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ,సైబర్ నేరాలు,రోడ్డు భద్రత అంశాలు,మత్తు పదార్థాల ప్రభావం,పిల్లలలో విపరీత ధోరణలు వంటి అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్,చిన్న గూడూరు ఎస్సై కుశకుమార్,సీరోల్ ఎస్సై సంతోష్,20 మంది పోలీసు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.