మహా తెలంగాణ/ కురవి
కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయకార్యనిర్వహణ అధికారి శ్రావణపు సత్యనారాయణ, ధర్మకర్తల మండలి చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి చర్యలు తీసుకున్నారు.