వైభవంగా గంగమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ట హోమం వి అమ్మవారి విగ్రహానికి భక్తుల జలాభిషేకం

మహాతెలంగాణ/మహబూబాబాద్:

మహబూబాబాద్ పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి విగ్రహ స్థాపన కార్యక్రమం లో భాగంగా కొత్తగా నిర్మాణం చేసినటువంటి గంగమ్మ తల్లి గుడిలో గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిస్టాపన కార్యక్రమం అతంత వైభవం గా జరుగుతోంది. బుధవారం మహబూబాబాద్ పట్టణం లో గంగమ్మ తల్లి విగ్రహం శోభయాత్ర నిర్వహించిన ప్రతిష్టపన నిర్వహణ కమిటీ గురువారం గణపతి హోమం, ప్రతిష్ట హోమంలో అమ్మవారికి బెస్త కుటుంబాలు భక్తి శ్రద్దలతో బిందెలతో నీళ్లు తెచ్చి అమ్మవారి కి నవధాన్యాలు, పుష్పాలతో జలాభిషేకం నిర్వహించారు. వేదంపండితుల మంత్రోచ్చారణ లతో హోమం నిర్వహించారు. ఈ హోమంలో గంగపుత్ర కుటుంబాల దంపతులు హోమం పూజలో పాల్గొన్నారు. శుక్రవారం గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టతో పాటుగా పోతురాజు విగ్రహ ప్రతిష్ట, ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సొసైటీ గౌరవ అధ్యక్షులు మైస నాగయ్య, పట్టణ గంగపుత్ర సంఘ గౌరవ సలహాదారు కన్వీనర్ డోలి సత్యనారాయణ, సాధన దంపతులు పట్టణ గంగపుత్ర సంగాధ్యక్షులు దేశ బోయినవెంకటస్వామి గారు, కోశాధికారి దేశబోయిన అనిల్ గారు, ప్రధాన కార్యదర్శి కందరబోయిన ఉపేందర్, డోలి లింగబాబు, చుక్కల నరేష్ అవారీ అనిల్, ఆవారి సునీల్ అవారి శ్రీనివాస్,డోలి కృష్ణ,గోపురాజు, చుక్కల కనకయ్య, మద్దెర్ల రాజన్న, దేశాబోయిన విజయ్,చుక్కల పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. Z

🙏🙏

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *