దేశంలో రాహుల గాంధీ నాయకత్వం అవసరం

దనియాకుల రామారావు

​గార్ల లో మిన్నంటిన రాహుల్ గాంధీ పుట్టినరోజు సంబరాలు

దనియాకుల రామారావు
ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

మహా తెలంగాణ/​గార్ల :

గార్లలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సంబురాలు మిన్నంటాయి, మండల కాంగ్రెస్ అద్యక్షుడు దనియాకుల రామారావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శనివారంనాడు గార్ల మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దనియాకుల రామారావు ప్రత్యేక చొరవతో,పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు.
​కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.
​మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నీకులు సురపురెడ్డి వెంకట రెడ్డి, రావూరి వెంకట రామయ్య, మాజీ ఎంపీపీ మలోత్ వెంకట్ లాల్, దని యాకుల రామారావు,ల చేతుల మీదుగా భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల నినాదాలు, జై కాంగ్రెస్ శబ్దాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం నాయకులకు, ప్రజలకు, అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
​ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం ఉందన్నారు.
దేశంలో విద్వేష రాజకీయాలను పారద్రోలి, ప్రేమను పంచడమే లక్ష్యంగా ‘భారత్ జోడో యాత్ర’ ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిన మహోన్నత నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు.
పేదలు, రైతులు, యువత, మైనారిటీల హక్కుల కోసం పార్లమెంట్‌లోనూ వీధుల్లోనూ నిరంతరం పోరాడుతున్న ఏకైక ధీశాలి రాహుల్ గాంధీ. దేశ భవిష్యత్తు ఆయన నాయకత్వంలోనే సురక్షితంగా ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా గార్ల కాంగ్రెస్ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయని తెలిపారు.
​ఈ వేడుకల్లో గార్ల మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఈ కార్యక్రమంలో మండ రాము గౌడ్ ,గుగులోత్ శ్రీనివాస్, బాపణపల్లి సుందర్,జవ్వాజి శ్రీనివాస్, బాధావత్ ప్రసాద్, బద్దారం సర్పంచ్ రమేష్, పుల్లూరు సర్పంచ్ బాబురావు, కొనతం సత్యనారాయణ రెడ్డి, గదాల మోహన్ రెడ్డి,గోసు నగేష్, రవి నాయక్, చింతల శ్రీను, నవీన్ బాబు, వీరస్వామి, యువజన కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీ, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మరియు వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next కలెక్టర్ ఆదేశాలతో ఇసుక ప్రాంతాల ఆకస్మిక తనిఖీలు మహాతెలంగాణ/నర్సింహులపేట. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండలంలోని ఇసుక ప్రాంతాల్లో అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తొర్రూర్ ఆర్డీఓ గణేష్ , మహబూబాబాద్ గనులు మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణ , తొర్రూర్ సీఐ గణేష్ , తహసీల్దార్ రమేష్ బాబు , ఎస్ఐ వెంకన్న మరియు సంబంధిత శాఖల సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మండలంలోని ఇసుక నిల్వ ప్రాంతాలు, రవాణా మార్గాలు, అనుమతులతో జరుగుతున్న తవ్వకాలు, నిల్వల పరిస్థితిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, అక్రమ నిల్వలు, అనుమతి లేని రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.అక్రమ ఇసుక రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *