మనుకోట జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో వ్యాసరచన, వంట పోటీలు

మహా తెలంగాణ/మహబూబాబాద్ :

మానకోట జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా స్థానిక గాదే రుక్మారెడ్డి స్కూల్ రెడ్డి స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, గ్యాస్ మరియు వంట నూనెల వినియోగం తగ్గింపు పై అవగాహన కల్పిస్తూ మహిళలకు వంట పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మానకోట జిల్లా మహిళా మోర్చా కన్వీనర్ శ్రీమతి సోమారపు సరోజ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకోట జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ వల్లభూ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత 12 సంవత్సరాల్లో మహిళల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సంక్షేమ పథకంలో వారి భాగస్వామ్యాన్ని పెంచారని పేర్కొన్నారు.

అలాగే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం మోదీ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు, వంట పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్ . జిల్లా ఉపాధ్యక్షురాలు ఒర్సు పద్మావతి, జిల్లా కార్యదర్శి ధారా ఇందూ భారతి. జిల్లా ఆఫీసు ఇంచార్జ్ పల్లె సందీప్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ రేష్మ. యువమోర్చా నాయకులు దిద్ది మహేష్ , మహిళా మోర్చా కార్యకర్తలు, విద్యార్థులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *