మహబూబాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తక్కువగా ఉండడం, రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మస్జిద్ లలో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని ఆదేశించారు.ఈ మేరకు ఈరోజు పవిత్ర జుమ్మా సందర్భంగా మహబూబాబాద్ పట్టణం లోని గౌసియా మస్జిద్ లో మధ్యాహ్నం నమాజు అనంతరం, మా ప్రాంతంలో అధిక వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక దూవా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌసియా మస్జిద్ ఇమామ్ మౌలానా సయ్యద్ రిజ్వి అహ్మద్, మౌజ్జన్ దిలవార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరిద్, ఈద్గా కమిటీ అధ్యక్షుడు అసాద్ అలి ఖాన్, కమిటీ బాధ్యులు ఖలిద్, యాకూబ్, జాని, గౌస్,జమిల్ , అమిర్,యువకులు గయాజ్, అశ్రఫ్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.