విద్యార్థులలో ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించాలి

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

మహాతెలంగాణ/మహబూబాబాద్:

కురవి మండల కేంద్రంలో జరుగుతున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులందరూ మంచి నైపుణ్యాలను పెంపొందించే విధంగా , ఆంగ్ల భాషలో పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని,శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడానికి తోడ్పడాలని దీనికోసం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తన బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఉపాధ్యాయులచే నేర్చుకున్న అంశాలను వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సత్యనారాయణమూర్తి, డీఎస్ఓ అప్పారావు, ఎంఈఓ బాలాజీ, పాఠశాల హెచ్ఎం వాహిద్, ఆర్పీలు వెంకటేష్, శివప్రసాద్, శేఖర్, ఓంకార్, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *