పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్
మహా తెలంగాణ/మహబూబాబాద్ :
సంక్షేమ పథకాల్లో పద్మశాలీలకు ప్రత్యేక స్థానం కల్పించడానికి కృషి చేస్తానని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు.శుక్రవారం పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల వెంకన్న ఆధ్వర్యంలో పద్మశాలీల డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.జిల్లా కేంద్రంలో టెక్ట్స్ టైల్ పార్కు కొరకు వంద ఎకరాల స్థలం,స్వాతంత్ర్య సమరయోధుడు,తొలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మృతి వనానికి రెండు ఎకరాల స్థలం,కోటి రూపాయల నిధులు కేటాయించాలని,ప్రతి మండలానికి పద్మశాలి సంఘాలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం,ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లలో నిబంధనలను సడలించి బొంబాయి,భీమండి,సూరత్ కు బ్రతకడానికి పోయి స్వదేశం వచ్చి బ్రతుకుతున్న చేనేత కార్మికులకు ఇండ్ల మంజూరుతో పాటు పింఛన్లను అందజేయాలని కోరారు.అనంతరం సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపునకు పద్మశాలీల కృషి ఎనలేనిదని పద్మశాలీల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల రామకృష్ణ,పెండెం రమేష్,కూరపాటి వెంకటేశ్వర్లు,చెలమల నారాయణ,చెన్నూరు విజయ లక్ష్మీ,పట్టాభి లక్ష్మయ్య,కొండబత్తిని జగదీశ్వర్,దాసరి శ్రీనివాస్,శ్రీరాములు,కుమార స్వామి,పురుషోత్తం,రవి కుమార్,రాష్ట్ర నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.
పోటో రైటప్01, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కు వినతిపత్రం అందజేస్తున్న పద్మశాలీలు