మహా తెలంగాణ/మహబూబాబాద్
శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించి సార్, సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు, ఎనమ్రేషన్ ఫార్మ్స్ పంపిణీ చేసి తిరిగి బిఎల్ఓ కు రాణి వాటి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి డిజిటలైజేషన్ చేయాలని, ప్రతి ఇంటింటికి తిరిగి వారి యొక్క వివరాలు తీసుకోవాలన్నారు, అందుకోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్వో లు, సూపర్వైజర్లు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసే ఆగస్టు మూడు లోపు ఫార్మ్స్ సమర్పించాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న (నరసింహుల పేట) సాంఘిక సంక్షేమ శాఖ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని తనిఖీ చేసి పిల్లలతో ఆత్మీయంగా మాట్లాడారు, అనంతరం తరగతి గదులు, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు అందుతున్న విద్యా సౌకర్యాలు, డైట్ మెనో గురించి ఆరా తీశారు, ప్రభుత్వం కల్పిస్తున్న ఖచ్చితమైన డైట్ మెనో ను అమలు చేయాలని, ప్రతి సబ్జెక్టు పై అవగాహన పట్టు వచ్చే విధంగా విద్య బోధనలు అందించాలని, ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా విద్యార్థులకు అందించాలని, ఉపాధ్యాయుల హాజరు శాతం కచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని,
విద్యార్థులకు ఎడ్యుకేషన్, హెల్త్, సానిటేషన్, న్యూట్రిషన్, లపై అవగాహన ఉండేవిధంగా చూడాలని తెలిపారు. పిల్లలకు, భోజనం సిద్ధం చేసే సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాలికల యొక్క ఆరోగ్య మానసిక స్థితిగతులను నిత్యం గమనిస్తూ ఉండాలని, ఉపాధ్యాయులను ఆదేశించారు, ఏలాంటి సమస్యలు ఉన్న తక్షణమే తమ నోటీసు తీసుకురావాలని తెలిపారు.